బన్నీ విజయంపై పవన్ అభిమానుల వింత ప్రవర్తన

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా..అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. వారు దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్ ని ఎవరైనా పల్లెత్తి మాటన్నా వారు సహించలేరు. సోషల్ మీడియా దాడులు ఒక్కోసారి భౌతిక దాడులకు కూడా దిగుతారు. వీరి అత్యుత్సాహం కొందరిని చాలా ఫేమస్ చేసేసింది. ఇక మెగా హీరోల ఫంక్షన్ కి వెళ్లడం, అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయన గురించి మాట్లాడాల్సిందే అని పెద్దపెద్దగా అరవడం కామన్ అయిపోయింది. దీనిపై చాలా మంది హీరోలు అసహనం వ్యక్తం చేశారు. బన్నీ ఐతే ఆ అసహనాన్ని బయటపెట్టేశారు. దీనితో కొన్నాళ్లు పవన్ ఫ్యాన్స్ అతనిపై సోషల్ మీడియా వార్ షురూ చేశారు. కొన్ని సందర్భాలలో పవన్ కూడా వారిపై కోప్పడ్డారు.

కాగా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో చిత్రం పట్ల వారి స్పందన వింతగా ఉంది. పవన్ కళ్యాణ్ కు అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ మూవీని ఇచ్చిన త్రివిక్రమ్ బన్నీకి బ్లాక్ బస్టర్ ఇవ్వడమేంటని నొచ్చుకుంటున్నారు. ఈ కథ పవన్ ఇమేజ్ కి చక్కగా సరిపోయేది.. పవన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరేదని వారు ఫీలైపోతున్నారు. పవన్ ఎటూ రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ ఆయనతో తీయాల్సింది అని బాధపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులు చేస్తున్న ఈ కామెంట్స్ చూసిన నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక పవన్ పింక్ రీమేక్ వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus