పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అభిమానులు హీరో, కాదు కాదు, ఆరాధ్య దైవం. వారు పాటించే పవనిజమ్ అనేది ఏదో స్టైల్ కోసం కాదు, వారు దాన్ని తమ మతంగా భావిస్తారు. దాదాపుగా పవన్ అభిమానులు పవన్ ను హీరోగా కాకుండా భగవంతుడిలగా పూజిస్తారు. అయితే అంతటి పరమ భక్తులే పవన్ ను మోసం చేశారా? పవన్ కు వెన్నుపోటు పొడిచారు. పవన్ పై అభిమానాన్ని తాకట్టు పెట్టి తప్పులు చేశారా అంటే అవును అంటున్నాడు సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇంతకీ విషయం ఏమిటంటే…ఏది సూటిగా, సుత్తి లేకుండా చెప్పే వర్మ. తన ట్విటర్ వేదికగా ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకుంటున్నాడు. ఒక పక్క పవన్ తనకు చాలా ఇష్టం అని చెబుతూనే, మెగా ఫ్యామిలీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయి అంటూనే, మరో పక్క పవన్ కు ప్రాణం అయినటువంటి తన అభిమానులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ మధ్య వర్మ ట్వీట్ చేస్తూ…తన ట్వీట్స్ ను సరిగా అర్ధం చేసుకోవడం లేదు కాబట్టి.. ఇకపై పవన్ కి పవన్ ఫ్యాన్స్ కి ట్వీట్స్ వేయనని గుడ్ బై చెప్పాడు. అయితే మాట నిలబెట్టుకుంటే వర్మ ఎలా అవుతాడు అనుకున్నాడో ఏమో..మళ్లీ ట్విటర్ వేదికగా పవన్ ఫ్యాన్స్ పై విరుచుకు పడ్డాడు. ఇంతకీ వారిని వర్మ ఏమన్నాడు అంటే…’ఓ స్టార్ పవర్ ని ఒంటరిగా వదిలేసి జంగిల్ బుక్ ఆడుతున్న థియేటర్స్ లో కూర్చున్నారు ఫ్యాన్స్ అంతా. వాళ్లంతా పవర్ కి వెన్నుపోటు పొడిచేవాళ్లు’ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. అయితే ఇందులో కోసమెరుపు ఏంటంటే, ఈ ట్వీట్ టార్గెట్ ఫ్యాన్స్ మాత్రమే, పవన్ కాదు, ఎందుకంటే వర్మ తన ట్వీట్ లో ఎక్కడా పవన్ అనే మాట వాడలేదు. పవర్ అంటూనే రాయాల్సినదంతా రాసేశాడు. అదీ మరి వర్మ గారి ట్వీట్ పురాణం. దీనిపై అభిమానుల కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి.