Pawan Kalyan: ‘బద్రి’ లో రేణు దేశాయ్ ‘మిస్సమ్మా’ సాంగ్‌ గురించి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

  • November 19, 2022 / 11:43 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి, క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా.. అతితక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. కెరీర్ స్టార్ట్ చేసి వరుసగా ఏడు సక్సెస్‌లతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. పవన్ ముందునుండి మీడియా, ఇంటర్వూలు వంటి వాటికి కొంచెం దూరంగా ఉండేవాడు. అయితే ‘బద్రి’ సినిమా టైంలో ఇచ్చిన ఓ ఇంటర్వూకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

పవన్ కళ్యాణ్‌కి ఫస్ట్ నుండి టెక్నికల్ సైడ్ మంచి నాలెడ్జ్ ఉంది.. మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తర్వాత ఫైట్స్ కంపోజిషన్, స్టోరీ రైటింగ్, డైరెక్షన్ లాంటివన్న మాట. అయితే సాంగ్స్ విషయంలోనూ తనకు స్పెషల్ టేస్ట్ ఉంనే విషయాన్ని ‘బద్రి’ మూవీ టైంలో ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.. ‘‘ఒక పాటని సంగీతం, సాహిత్యం, కొరియోగ్రఫీ అని భాగాలుగా విడదీసి చూడలేను.. అసలు కంటెంట్ ఏంటి.. ఆ పాట ద్వారా ఏం చెప్పబోతున్నారనేది గమనిస్తాను..

ఆ టోటల్ ఫీల్ బాగుంటే నాకే కాదు.. ఎవరికైనా పాట నచ్చుతుంది’’ అని సాంగ్స్ మీద తనకున్న అభిరుచి గురించి తెలియజేశారు.. ‘‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాట అంటే చాలా ఇష్టం.. ట్యూన్, భావం, పాడిన విధానం, పిక్చరైజేషన్ అన్నీ చాలా బాగుంటాయి.. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సాంగ్ కూడా చాలా ఇష్టం.. అన్నయ్య పాటల్లో ఈ రొమాంటిక్ సాంగ్ పొయిటిక్‌గా ఉంటుంది.. అలాగే ‘ఘరానా మొగుడు’ లో ‘బంగారు కోడిపెట్ట’, ‘ముఠామేస్త్రి’ లో ‘ఈ పేటకి నేనే మేస్త్రీ’ పాటలు కూడా చాలా ఇష్టం..

కొరియోగ్రఫీ బేస్డ్ పాటల్లో చేయడం అనేది నా ఆలోచనా తీరుకి నచ్చదు. ఒక ఫీలింగ్ అనేది బిల్డ్ అవ్వాలనిపిస్తుంది. హీరో అయిన తర్వాత నేను చేసిన డ్యుయెట్స్‌లో ఎంజాయ్ చేసింది అంటే ‘బద్రి’ లో పాటలే.. ముఖ్యంగా ‘చికిత చికిత’, ‘మిసమ్మా’ సాంగ్స్.. హీరో కాకముందు నేను ఎలా ఊహించుకున్నానో అలాగే ఈ పాటలు చేయడం జరిగింది’’ అని చెప్పుకొచ్చారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus