మరో కొత్త కథానాయికను పరిచయం చేయనున్న పవన్ కళ్యాణ్!
- April 28, 2016 / 10:19 AM ISTByFilmy Focus
సుప్రియ (అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి), రేణు దేశాయ్ (బద్రి), నేహ ఒబెరాయ్ (బాలు), నికిషా పటేల్ (పులి), సారాజేన్ డయాస్ (పంజా).. ఇలా బోలెడు మంది హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తాజాగా మరో కొత్త కథానాయికను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడీగా.. శరత్ మరార్ నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఒక కొత్తమాయిని కథానాయికగా పరిచయం చేయనున్నాడట పవన్ కళ్యాణ్. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం కోసం కథానాయిక అన్వేషణ ప్రస్తుతం జరుగుతోంది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















