Pawan Kalyan: మొహమాటానికి పోయి పవన్ నష్టపోయారా..?

సాధారణంగా స్టార్ హీరోలకు సినిమా రిలీజ్ కాకముందే సినిమా ఫలితం తెలిసిపోతూ ఉంటుంది. సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో హీరోలు ముందుగానే అంచనా వేస్తుంటారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఒక సినిమా ఫ్లాప్ అవుతుందని ఆయన ముందుగానే ఊహించారని పవన్ కళ్యాణ్ సన్నిహితులలో ఒకరైన ఆనంద్ బాబు తాజాగా చెప్పుకొచ్చారు. కోలీవుడ్ డైరెక్టర్ ధరణి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా బంగారం సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఎ ఎం రత్నం నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు స్వల్పంగా నష్టాలు వచ్చాయని సమాచారం. ఆనంద్ సాయి ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు ధరణి బలవంతం వల్లే పవన్ ఈ సినిమాలో నటించారని తెలిపారు. బంగారం సినిమాకు ముందు తమిళంలో ధరణి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు హిట్ కావడంతో పవన్ ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చిందని ఆనంద్ సాయి పేర్కొన్నారు.

బంగారం కథ విన్న సమయంలోనే ఈ సినిమా చేయనని పవన్ ఎ ఎం రత్నంకు చెప్పారని అయితే ధరణి పవన్ చేతులు పట్టుకుని తనను నమ్మమని కోరడంతో పవన్ ఆ సినిమాను అంగీకరించాల్సి వచ్చిందని ఆనంద్ సాయి పేర్కొన్నారు. తమ్ముడు, ఖుషి సినిమాలకు పవన్ కళ్యాణ్ ఇన్ పుట్స్ ఇవ్వడంతో ఆ ఇన్ పుట్స్ వల్ల ఆ సినిమాలు సక్సెస్ అయ్యాయని బంగారం సినిమా విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ముందుగానే ఊహించిన విధంగా ఆ సినిమా ఫ్లాప్ అయిందని ఆనంద్ సాయి వెల్లడించారు.


థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus