Pawan Kalyan: 20 ఏళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానంటూ ఫోటో షేర్ చేసిన పవన్ కళ్యాణ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా.. సింగిల్ పిక్ లీక్ అయినా కానీ సోషల్ మీడియా షేక్ అయిపోతుంటుంది.. ఫ్యాన్స్ నెట్టింట మామూలుగా ట్రెండింగ్ చేయరసలు.. ఇటీవలే తన సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వాహనంతో పవన్ ఫోటోలు, వీడియోలు బయటకి వచ్చాయి.. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి.. రీసెంట్‌గా ‘హరి హర వీరమల్లు’ షూటింగు లొకేషన్‌లో డైరెక్టర్ హరీష్ శంకర్, క్రిష్, మైత్రీ మూవీస్ నిర్మాతలతో కలిసి ఉన్న పవన్ లుక్స్ బాగా వైరల్ అవుతున్నాయి..

ఫ్యాన్స్ పవర్ స్టార్ గెటప్ గురించి డిస్కస్ చేసుకుంటుండగానే.. ఓ అరుదైన ఫోటోతో ప్రేక్షకాభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు పవర్ స్టార్.. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న పిక్ పోస్ట్ చేస్తూ.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ నా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానని కామెంట్ చేశారు.. తీక్షణమైన చూపుతో.. పవర్ స్టార్ ఫియర్ లెస్ ఫైరీ లుక్ కిరాక్ ఉందంటున్నారు అభిమానులు.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ కోసం పవన్..

హార్స్ రైడింగ్, విలు విద్య, మార్షల్ ఆర్ట్స్ వంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పిక్స్, వీడియోలు వైరల్ అయ్యాయి.. పవన్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ లో చేసిన మార్షల్ ఆర్ట్స్ అప్పట్లో సెన్సేషన్.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్.. ‘తమ్ముడు’, ‘జానీ’ లాంటి సినిమాల్లోనూ ఇలాంటివి చూపించారు.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ‘డాడీ’ మూవీలో ఓ ఫైట్ కూడా కంపోజ్ చేశారు.. పవన్ షేర్ చేసిన పిక్‌ని ట్రెండ్ చేస్తూ..

ఆయన ఇంతకుముందు చేసిన మార్షల్ ఆర్ట్స్ తాలూకు ఫోటోలు, వీడియోలతో నెట్టింట హంగామా చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.. నెటిజన్లతో పాటు ఇతర హీరోల అభిమానులను కూడా బాగా ఆకట్టుకుంటోంది పవర్ స్టార్ లుక్.. 2023 వేసవిలో ‘హరి హర వీరమల్లు’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus