పుట్టిన రోజున పవన్ ఎక్కడికెళ్లారు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (శుక్రవారం) ని అభిమానులు సందడిగా జరుపుకున్నారు. పవన్ మాత్రం వేడుకలలో పాల్గొనలేదు. మీడియాకు సైతం చిక్కలేదు. కానీ ఆయన సెప్టెంబర్ 2న పూణెకి వెళ్లారని తెలిసింది. అక్కడ ఉన్న తన పూర్వ భార్య రేణు దేశాయ్ ఇంటికి వెళ్లినట్లు సమాచారం. తన పిల్లలు అకీరా, ఆద్య లతో పవర్ స్టార్ రోజంతా సరదాగా గడిపారని పవన్ సన్నిహితులు వెల్లడించారు. పుట్టిన రోజు అయినా కేక్ కట్ చేయడం వంటివి పెట్టుకోలేదని, బయటకు కూడా వెళ్లలేదని, సంతోషంగా ఇంట్లోనే కబుర్లు చెప్పుకున్నారని వివరించారు.

కొన్నేళ్ల క్రితం రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చినప్పటికీ.. తల్లి దండ్రుల ఎడబాటు ప్రభావం పిల్లలపై పడకుండా పవన్ జాగ్రత్త పడ్డారు. చిన్నారుల బాధ్యతలను తీసుకోవడమే కాకుండా పండుగలు, పుట్టిన రోజు వేళల్లో పవన్ తన పూర్తి సమయాన్ని అకీరా, ఆద్యలకు కేటాయిస్తున్నారు. అయితే మీడియా వాళ్లకు తెలిస్తే పిల్లలు పేపర్లోకి ఎక్కుతారని భావించి, వారి స్వేచ్ఛను పోగొట్టడం ఇష్టం లేక, ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఊరికి రాజైనా ఓ తల్లికి బిడ్డే.. అని సినీ రచయిత అన్నట్లు.. పవర్ స్టార్ అయినా తండ్రి హృదయం ఎక్కడికి పోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus