పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోవడం వల్ల కమర్షియల్ గా ఫ్లాప్ గా నిల్చింది. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాకి మొదటి మూడు రోజులు మంచి వసూళ్లు వచ్చాయి.
జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లో 70 శాతం ఇక్కడే రికవర్ చేసింది. కానీ లాంగ్ రన్ లో మాత్రం అదే జోరుని కొనసాగించలేకపోయింది. ఫుల్ రన్ లో 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాని రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాకి ఎవరూ ఊహించని రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు తో పాటుగా హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రాన్ని దబ్ చేసి వదిలారు.
తెలుగు మరియు హిందీ వెర్షన్స్ టాప్ 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా నెట్ ఫ్లిక్స్ మొత్తం మీద ఈ చిత్రం టాప్ 7 స్థానం లో కొనసాగుతుంది. ఒక ఫ్లాప్ టాక్ వచ్చిన రీజనల్ సినిమాని జనాలు ఇలా ఎగబడి చూడడం ఇదే తొలిసారి. విచిత్రం ఏమిటంటే ఈ సినిమా పాకిస్థాన్ మరియు బాంగ్లాదేశ్ వంటి ప్రాంతాల్లో టాప్ 8 స్థానం లో కొనసాగుతుంది.
ఇది చూసి సోషల్ మీడియా లో పాకిస్థాన్ లో కూడా మన తెలుగు సినిమాలకు ఇంత ఆదరణ ఉందా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా సాగుతున్న అంశం.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!