పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్మెంట్!

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రీమేక్ హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఇప్పటివరకు పలువరి కాంబినేషన్‌ పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్లినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. రీమేక్ అని ఎక్కడా ప్రస్తావించకపోయినా..

ఈ సినిమా స్క్రిప్ట్ కోసం పని చేసిన దర్శకుడు సాగర్ నే డైరెక్టర్ గా ఫిక్స్ చేయడంతో అసలు విషయం అర్ధమవుతోంది. కథ ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’, ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ వంటి సినిమాల్లో పోలీస్ అవతారంలో కనిపించిన పవన్ ఇప్పుడు మరోసారి సూపర్ కాప్ గా అలరించనున్నారు. ఇక ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం రానాని సంప్రదిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

కానీ ఈ విషయంపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి సినిమాను అనౌన్స్ చేసిన యూనిట్ పవన్ వెసులుబాటుని బట్టి షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. అవుట్ డోర్ లొకేషన్ లో సెట్స్ వేసి అక్కడే ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus