పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత చిత్రం ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. అందుకోసం ఎక్కడా కాంప్రమైజ్ కావడంలేదు. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గానే రావాలని భావిస్తున్నారు. అజిత్ నటించిన “వీరమ్” మూవీని తెలుగు వారికి తన స్టయిల్ లో అందించడానికి కృషి చేస్తున్నారు. మొదట్లో ఈ చిత్రాన్ని ఖుషి డైరక్టర్ సూర్య చేతిలో పెట్టారు.
అతను నటుడిగా బిజీ కావడంతో గోపాల గోపాల దర్శకుడు డాలీ కి తన సినిమా భాద్యతలు అప్పగించారు. పవన్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని డాలీ ఈ కథను మరిన్ని పవర్ ఫుల్ సీన్స్ యాడ్ చేశారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం కోసం పవర్ స్టార్ తన గెటప్ మార్చారు. రాయలసీమకు చెందిన ఫ్యాక్షనిస్టులా మీసం మెలి తిప్పారు.
కొంతకాలం క్రితం కొమురం పులి చిత్రంలో పవన్ మెలి తిప్పిన మీసం తో కనిపించారు. మళ్లీ ఇన్నేళ్లకి ఆ లుక్ లో కనిపించనున్నట్లు తెలిసి అభిమానులు సంబర పడిపోతున్నారు. గత శుక్రవారం పవన్ లండన్ వెళ్లారు. అక్కడి నుంచి రాగానే కొత్త చిత్రం పనిలో బిజీ కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.