Bheemla Nayak: అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకున్న పవన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ నిన్న రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. మేకర్స్ ఆశించిన మొత్తం కంటే భారీ స్థాయిలో భీమ్లా నాయక్ బిజినెస్ జరగనుందని తెలుస్తోంది. మరోవైపు ఈ టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

ఈ టీజర్ కు ఇప్పటికే యూట్యూబ్ లో 86 లక్షల వ్యూస్ వచ్చాయి. వేగంగా 4 లక్షల లైక్స్ అందుకున్న టీజర్ గా భీమ్లా నాయక్ టీజర్ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో సొంతం చేసుకోని రికార్డును పవన్ సొంతం చేసుకున్నారు. వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సంక్రాంతికి భీమ్లా నాయక్ తో కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తానని చెప్పకనే చెబుతున్నారు. ఊర మాస్ లుక్ లో పవన్ కనిపించి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు.

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా తెలుగు నేటివిటీకి తగిన విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేశారు. త్రివిక్రమ్ చేసిన మార్పులు సినిమాకు ప్లస్ అవుతాయని ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటిస్తుండగా రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus