తెరపైకి పవన్-నితిన్-త్రివిక్రమ్ సినిమా !

  • June 5, 2017 / 07:59 AM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆయన అభిమానులకు ఎంత ఇష్టమో, హీరో అయిన నితిన్ కి కూడా అంతే ఇష్టం. ఒకరకంగా చెప్పాలి అంటే నితిన్ పవన్ పాటలను తన సినిమాలో పెట్టుకుంటూ, పవన్ ను అనుసరిస్తూ, పవన్ ఫ్యాన్స్ ను తన ఫ్యాన్స్ గా మార్చుకున్నాడు. అయితే ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మంచి హీరోగా ప్రభంజనం సృష్టిస్తున్న పవన్ కల్యాణ్ నిర్మాతగా మారి నితిన్ తో సినిమా తియ్యాలి అని ప్లాన్ చేశాడు. త్రివిక్రమ్ ఇచ్చిన లైన్ ను దర్శకుడు కృష్ణ చైతన్య డెవలప్, ఆ కధ బాగా నచ్చిన పవన్ ఈ సినిమాని నితిన్ హీరోగా తానే నిర్మించాలి అని పక్కా ప్లాన్ చేశాడు. అదే క్రమంలో సినిమాను లాంచ్ కూడా చేశారు. కానీ ఏమయిందో ఏమో తెలీదు కానీ, ఆ తరువాత సినిమా గురించి ఉలుకు లేదు, పలుకు లేదు. అయితే ఏ చప్పుడూ లేకపోవడంతో ఈ సినిమా హష్ కాకి అని అనుకున్నారు అందరూ.

కానీ టాలీవుడ్ లో వినిపిస్తున్న విషయం ప్రకారం, ఈ సినిమా ఆగలేదని, త్వరలో మొదలు కానుంది అని టాక్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని, అదే క్రమంలో ప్రస్తుతం అమెరికాలో ‘లై’ షూటింగులో వున్న నితిన్, ఈ నెల 14కి ఇండియాకి రాగానే కొంత విశ్రాంతి తరువాత ఈ సినిమా షూటింగ్ కి వస్తాడు అని సమాచారం. ఏది ఏమైనా…తనకు నచ్చిన హీరోతో అభిమాని సినిమా తియ్యడం సహజమే కానీ, తానంటే ఇష్టపడే అభిమానితో ఒక పవర్‌ఫుల్ పవర్ స్టార్ నిర్మాత సినిమా చెయ్యడం ఇదే తొలిసారి. చూద్దాం మరి ఈ ఇద్దరు కలసిన ఆ కలయిక ఎలాంటి రిసల్ట్ ఇస్తుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus