పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలలో ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. 2024 సంవత్సరం సమ్మర్ లో ఎన్నికలు జరగనున్నాయనే సంగతి తెలిసిందే.
అయితే వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పవన్ మరో ఏడాది వరకే సినిమాలలో నటిస్తారని ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సినిమాలపై దృష్టి పెట్టరని సమాచారం అందుతోంది. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నారు. పవన్ హరీష్ కాంబినేషన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమా తెరకెక్కాల్సి ఉంది.
ఈ సినిమాలతో పాటు పవన్ వినోదాయ సిత్తమ్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ క్లారిటీతోనే ఉన్నారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు ఈ ఏడాదే రిలీజ్ కానుండగా ఇతర సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. పవన్ రాజకీయాల్లో సక్సెస్ సాధించినా సినిమాల్లో కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో తొలి పాన్ ఇండియా హిట్ ను ఖాతాలో వేసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. పవన్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే పవన్ రెమ్యునరేషన్ మరింత పెరగనుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!