సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ అవ్వడం, తర్వాత జైలుకు వెళ్లడం.. మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అవ్వడం జరిగింది. అల్లు అర్జున్ రిలీజ్ అయ్యాక టాలీవుడ్ మొత్తం కదిలి వెళ్లి అల్లు అర్జున్ ను పరామర్శించింది. తర్వాత అల్లు అర్జున్ చిరు (Chiranjeevi) , నాగబాబు (Nagendra Babu) ..ల ఇంటికి వెళ్లడం కూడా జరిగింది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఎక్కడా కనిపించలేదు. అల్లు అర్జున్, అల్లు అరవింద్(Allu Aravind)..లను పరామర్శించేందుకు కూడా పవన్ రాలేదు.
దీంతో పవన్.. ‘అల్లు అర్జున్ అరెస్ట్ విషయంపై స్పందించడానికి ఆసక్తిగా లేడు’ అనే అనుమానం అందరికీ వచ్చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ కళ్యాణ్ రియాక్ట్ కావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో.. ఉద్యోగిని పరామర్శించేందుకు రిమ్స్ హాస్పిటల్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ ఘటనపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న టైంలో ఓ రిపోర్టర్ అల్లు అర్జున్ అరెస్టు గురించి పవన్ ని సూటిగా ప్రశ్నించాడు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కొంచెం ఇబ్బంది పడుతూనే స్పందించారు. ‘మనుషులు చచ్చిపోతున్నారు ఇక్కడ.. ఇప్పుడు సినిమాల గురించి ఎందుకు. పెద్ద సమస్యల గురించి ప్రశ్నించండి. సినిమాల గురించి వద్దు’ అంటూ పవన్ చెప్పుకొచ్చారు. దీనికి ముందు కొందరు ‘ఓజి’ (OG Movie) అని అరిచారు. అలా నినాదాలు తీసే వారిపై కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ గురించి పవన్ ను ప్రశ్నించిన టైంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Pawan Kalyan reaction on Allu Arjun arrest
పానకంలో పుడకల్లా సందర్భం లేని ప్రశ్నలు వేస్తే ఏ లీడర్కైనా కాలిపోతుంది. కాకపోతే అందరూ బయటపడరు. పవన్ కూడా బయటపడలేదు. కానీ ఆయన అసహనం మాత్రం కనిపిస్తుంది.
కడపలో ఉద్యోగి దాడిపై ఘటనలో మీడియాతో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ అరెస్టుపై ఓ… pic.twitter.com/ofk2VcJOoX
— Telugu360 (@Telugu360) December 28, 2024