Pawan Kalyan: ‘వకీల్ సాబ్’.. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్, షేర్ ఎంతంటే..?

‘వకీల్ సాబ్’ సినిమాతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణుశ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో అటు పవన్ కళ్యాణ్, ఇటు దిల్ రాజు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు భయంకరమైన లాభాలను తీసుకొచ్చింది. ‘వకీల్ సాబ్’ సినిమాకి రూ.50 కోట్ల రెమ్యునరేషన్.. దాంతో పాటు సినిమా లాభాల్లో వాటాలు అనే విధంగా పవన్ తో డీల్ కుదుర్చుకున్నారు.

అయితే సినిమా విడుదలకు ముందే లాభాలతో సంబంధం లేకుండా రూ.65 కోట్లు పవన్ కు ఇచ్చేలా సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఆ విధంగా ‘వకీల్ సాబ్’ సినిమా కోసం మొత్తం పవన్ వసూలు చేసిన ఫీజు రూ.65 కోట్లు అని తెలుస్తోంది. నటుడు ప్రకాష్ రాజ్ కు ఈ సినిమాకి గాను కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. సినిమా థియేటర్, నాన్ థియేటర్ హక్కులన్నీ కలిపి రూ.150 కోట్లకు కాస్త అటు ఇటుగా మార్కెట్ చేశారు.

డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. అవి కాకుండానే రికార్డులో సినిమాకి వ్యాపారం జరిగింది. దిల్ రాజు ఉంచుకున్న ఏరియాలు కూడా భారీ మొత్తంలో కలెక్షన్స్ రాబట్టాయి. నిర్మాతగా దిల్ రాజుకి మొత్తం రూ.50 కోట్ల మేరకు లాభం వచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ మొత్తంలో బోనీకపూర్ షేర్ ఎంత..? అనే విషయం తెలియాల్సివుంది!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus