సముద్రఖని డైరెక్షన్ లో పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ రిలీజ్ కు నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. అయితే బ్రో మూవీ నైజాం హక్కులు ఏకంగా 30 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. పవన్ కీలక పాత్రలో నటించడం వల్ల ఈ సినిమా హక్కులు ఈ స్థాయిలో పలికాయి. ఈ సినిమాకు థియేట్రికల్ హక్కుల ద్వారా 120 కోట్ల రూపాయల నుంచి 130 కోట్ల రూపాయల రేంజ్ లో వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
ఈ సినిమాకు టీజర్ తో ప్రమోషన్స్ మొదలు కాగా ట్రైలర్ కూడా మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది. ఏపీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుందని ఈ ఈవెంట్ తో అంచనాలు రెట్టింపు కావడం ఖాయమని అందుకు సంబంధించి సందేహాలు అవసరం లేదని సమాచారం. ఈ విషయం తెలిసి బ్రో మూవీ నైజాం హక్కులకు ఇంత డిమాండా అని నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బ్రో మూవీ (Bro Movie) పవన్ కు హ్యాట్రిక్ సక్సెస్ ను అందించడంతో పాటు సాయితేజ్ ఈ సినిమాతో 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న హీరోల జాబితాలో చేరతారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బ్రో సినిమా బిజినెస్ విషయంలో నిర్మాతలు సంతృప్తితో ఉన్నారని సమాచారం.
బ్రో మూవీ తెలుగులో సక్సెస్ సాధిస్తే ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ వేగంగా సినిమాలలో నటించాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. బ్రో మూవీ రికార్డ్ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుంది. బ్రో మూవీ పవన్, సాయితేజ్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!