అభిమానులకు శిరసు వంచి కృతజ్ఞతలు చెప్పిన పవన్ కళ్యాణ్!

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి మంచి క్రేజ్ ఉంది. సినీ నటుడిగా ఆయన సంపాదించుకున్న అభిమానులకు నేతగా సేవ చేయడానికి రాజకీయాల్లో అడుగుపెట్టారు. జనసేన పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగా ప్రధాన విషయాలపై తన అభిప్రాయాన్ని చెప్పడానికి, ప్రభుత్వాలను ప్రశ్నించడానికి ఆగస్టు 2014 లో ట్విట్టర్ ఖాతాని ప్రారంభించారు. అక్కడి నుంచి తరచూ ట్వీట్స్ చేస్తూ అభిమానులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. ఇలా ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండడం వల్ల పవన్ ని ఫాలోవర్స్ అయ్యేవారి సంఖ్య  20,10,000కి చేరుకుంది. దీంతో ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాప్ ఫైవ్ తెలుగు హీరోల్లో జాబితాలో స్థానం దక్కించుకున్నారు.  ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఎమోషన్ అయ్యారు.

అభిమానులకు శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పారు. ”మూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం మొదలు పెట్టినపుడు… దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే కవచంగా… ఒకే గొంతుకతో మొదలు పెట్టాను, నేను స్పందించిన ప్రతి సమస్యకి మేమున్నామంటూ ప్రతిస్పందించి, ఈ రోజు ఇరవై లక్షల దీపాలతో దారంతా వెలిగించిన మీ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలతో… మీ పవన్ కళ్యాణ్‌…” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా సంచలనం సృష్టించింది. గంటలోనే ఐదు వేలకు పైగా లైకులు అందుకుంది. 2000లకు పైగా రీట్వీట్లు రావడం విశేషం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus