పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఆ ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయడంపై పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తుండగా ఆ ప్రశ్నలకు సంబంధించి త్వరలో స్పష్టత రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు.
అయితే మైత్రీ నిర్మాతలపై తాజాగా ఐటీ రైడ్స్ జరిగాయనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో జనసేన నేత ఒకరు వైసీపీ నేత మైత్రీ బ్యానర్ లో పెట్టుబడులు పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలపై వైసీపీ నేత ఘాటుగా స్పందించడం జరిగింది. అయితే పవన్ మైత్రీ బ్యానర్ లో నటిస్తున్న సమయంలో జనసేన నేత ఆరోపణలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో పవన్ కళ్యాణ్ సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.
లేఖ ద్వారా పార్టీ నేతలు, జన సైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుందని పవన్ అన్నారు. ఆధారాలు లేకుండా ఆర్థిక ఆరోపణలు చేయొద్దని పవన్ కోరారు. నిర్ధారణ కాని అంశాల గురించి మాట్లాడవద్దని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పొత్తుల విషయంలో మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటానని ఆయన తెలిపారు. చిన్నా చితకా నేతలు చేసే విమర్శలను పార్టీకి ఆపాదించవద్దని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
మైత్రీ నిర్మాతల గురించి చేసిన కామెంట్ల వల్ల పవన్ (Pawan Kalyan) హర్ట్ అయ్యారని అర్థమవుతోంది. పవన్ సరైన సమయంలో రియాక్ట్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది పవన్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. పవన్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?