పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ లిస్ట్ లో మొదట మన నితినే ఉంటాడు అనడంలో సందేహం లేదు. పవన్ ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇస్తోన్న సందర్భంలో కచ్చితంగా ఈ సమ్మర్ కి పండగ చేసుకుందాం అని నితినే సంబరపడిపోయాడు. అయితే వారి ఆశల పై కరోనా నీళ్లు జల్లింది. ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని రిలీజ్ కాకుండా ఆపేసింది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా 20శాతం బ్యాలన్స్ ఉంది.
అది పూర్తవ్వాలంటే మరో 45 రోజులైనా పడుతుందని సమాచారం. పవన్.. క్రిష్ డైరెక్షన్లోనూ అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్లోనూ కూడా సినిమాలు చెయ్యడానికి ఒప్పుకున్నాడు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకూ షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదని ఈ మధ్యనే పవన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ చివరి వారం నుండీ బ్యాలన్స్ ఉన్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ ను ఫినిష్ చెయ్యాలని పవన్ డిసైడ్ అయ్యాడట. దిల్ రాజు రిక్వెస్ట్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
తక్కువ మంది సమక్షంలోనే ఈ షెడ్యూల్ ను కంప్లీట్ చేసే ఉంది కాబట్టి పవన్ ఇలా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. దాంతో సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ ను రిలీజ్ చేసుకోవచ్చు అని దిల్ ప్లాన్ చేశాడట. కానీ అలా జరిగితే నితిన్ కు పెద్ద ఇబ్బందనే చెప్పాలి. ఎందుకంటే తన ‘రంగ్ దే’ చిత్రం కూడా అదే టైం కు విడుదల కాబోతుంది. ఈ మధ్యనే విడుదల చేసిన టీజర్ ద్వారా ఆ విషాయాన్ని స్పష్టంచేసింది చిత్ర యూనిట్. పవన్ తో పోటీ అంటే నితిన్ పెద్ద రిస్క్ చేస్తున్నట్టే అని చెప్పాలి. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో..!