Pawan Kalyan: కరోనా భారిన పడ్డ పవన్ కళ్యాణ్… ప్రజలకు తన వంతు హామి..!
- April 16, 2021 / 08:22 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా టెస్ట్ చెయ్యగా .. రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. దాంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆయనకు ఏమీ కాకూడదు అంటూ ప్రజలు పూజలు వంటివి చెయ్యడం మొదలు పెట్టేసారు. ఇటీవల ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ చిత్రంతో మంచి విజయాన్నే అందుకున్నారు. ఆ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ… లోపం ఎక్కడ జరిగిందో తెలీదు. ఆయనకి కరోనా సోకింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యవసాయ క్షేత్రంలో ఉండి అపోలో ఆసుపత్రికి చెందిన వైద్యులతో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణే తెలియజేసారు. త్వరలోనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకి, అభిమానుల ముందుకి వస్తాను అంటూ ఆయన హామీ ఇచ్చారు. ఊపిరితిత్తులో స్వల్ప ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కూడా తేలడంతో ఆయనకి యాంటీ వైరల్ మందులు ఇస్తున్నట్టు సమాచారం.

పవన్ కు కరోనా అని తెలిసిన వెంటనే ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి అలాగే వదిన సురేఖలు ముందస్తు జాగ్రత్తగా అపోలో వైద్యులను పంపించారట. ఉపాసన కొణిదెల, రాంచరణ్ లు కూడా పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాలు తీస్తున్నట్టు తెలుస్తుంది.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

















