నందమూరి హీరో సినిమాకి మెగా హీరో సపోర్ట్!

  • October 22, 2017 / 05:00 AM IST

పవన్ కళ్యాణ్ & ఎన్టీయార్ ల నడుమ ఎలాంటి సాంగత్యం ఉందో తెలియదు కానీ.. వాళ్ళ అభిమానులు మాత్రం ఒకర్నొకరు ట్విట్టర్ సాక్షిగా బూతులు తిట్టుకుంటూ చిత్రవిచిత్రమైన రకాలుగా మాటల యుద్ధాలు చేసుకొంటుంటారు. పవన్ కళ్యాణ్-ఎన్టీయార్ ఇప్పటివరకూ ఒక స్టేజ్ ను షేర్ చేసుకోకపోవడం ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోకపోవడం కూడా ఇందుకు కారణం. ఈ కారణాన్ని మన మాటల మాంత్రికుడు గుర్తించినట్లున్నాడు, అందుకే వారిద్దరినీ ఒకే స్టేజ్ మీదకు తీసుకువచ్చే మహాధూతమైన ఘట్టాన్ని తన భుజస్కండాలపై వేసుకొన్నాడు త్రివిక్రమ్.

ఎన్టీయార్ హీరోగా హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్ర ప్రారంభోత్సవం రేపు (అక్టోబర్ 23) ఉదయం 10.20 గంటలకు జరగనుంది. ఎన్టీయార్ పై చిత్రీకరించనున్న ముహూర్తపు సన్నివేశానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండడంతోపాటు హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత చినబాబుతో మంచి అనుబంధం ఉండడంతో పవన్ కళ్యాణ్ ఈ ఓపెనింగ్ కు విచ్చేస్తున్నట్లు సమాచారం. ఏదైతేనేం.. పవన్ కళ్యాణ్ & ఎన్టీయార్ ఒక ఫ్రేమ్ లో కనిపించడం ఇరు వర్గాల అభిమానులకూ ఆనందదాయకమైన విషయమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus