పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న సినిమాకు బ్రేక్ పడలేదని పవన్ సన్నిహితులు స్పష్టం చేశారు. వారిద్దరూ దూరం అయ్యారనే వార్తలను ఖండించారు. ప్రస్తుతం పవన్ కాటమరాయుడు సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం కంప్లీట్ కాక ముందే తమిళ దర్శకుడు నీశన్ తో మరో చిత్రానికి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఏ ఏం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ దసరాకు పూజ కార్యక్రమాలు జరుపుకుంది. కాటమరాయుడు చిత్రం తర్వాత త్రివిక్రమ్ తో కాకుండా నీశన్ తో సినిమా ఒప్పుకోవడంతో పవన్, త్రివిక్రమ్ కి మధ్య విభేదాలు వచ్చాయని అందరూ భావించారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అది తెలుసుకున్న పవన్ సన్నిహితులు ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.
“పవన్, త్రివిక్రమ్ రోజూ మీట్ అవుతున్నారు. వారి సినిమా స్క్రిప్ట్ పై డిస్కషన్ చేసుకుంటున్నారు. స్క్రిప్ట్ కంప్లీట్ అయిన వెంటనే సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం పవన్ చేస్తున్న రెండు మూవీల కంటే ముందే త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమా థియేటర్లలోకి వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు” అని వివరించారు.