Pawan Kalyan: 24 ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వూ ఇప్పుడు వైరల్ అవుతోంది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి, క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా.. అతితక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి వరుసగా ఏడు సూపర్ హిట్లతో 20 ఏళ్ల క్రితమే సాలిడ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.. పవన్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ అవుతుంది.

ఇటీవల పవర్ స్టార్ ‘బద్రి’ టైంలో ఇచ్చిన ఇంటర్వూ న్యూస్ సందడి చేసింది. ఇప్పుడు 1998లో పవన్ ఇచ్చిన ఇంటర్యూకి సంబంధించిన న్యూస్ నెట్టింట సందడి చేస్తోంది.. ఇందులో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేసుకున్నాడు పవర్ స్టార్.. మీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అని అడిగితే.. చదువుకునే రోజుల్లో తనతో స్నేహం చెయ్యడానికి అమ్మాయిలెవరూ ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు కాదన్నారు.. ‘‘నాకు అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు..

చదువుకునే రోజుల్లో అమ్మాయిలు నాతో స్నేహం చేసేలా నాలో ప్లస్ పాయింట్స్ ఏమీ ఉండేవి కావు.. నా వైపు ఆకర్షితులు కావడానికి వాళ్లకి ఒక్క కారణం కూడా దొరకదు.. అలా ఉండే వాణ్ణి.. నథింగ్ స్పెషల్ విత్ మి’’ అంటూ పవన్ ఎవరికీ తెలియని విషయాలు చెప్పుకొచ్చాడు.. చిన్నతనంలో స్నేహితుడికి తెలియకుండా అతని అయస్కాంతం ముక్కలు తీసుకొచ్చేశానని.. తర్వాత రోజు తెగ వెతుక్కున్నాడని.. ఆరోజు అలా చేయకుండా ఉండాల్సింది అంటూ ఇప్పటికీ బాధ పడుతుంటానని అన్నారు..

కల్ట్ క్లాసిక్ ‘దేవదాసు’ మూవీలోని ‘అంతా భ్రాంతియేనా’.. పాట, సాహిత్యం, ట్యూన్ బాగా ఇష్టం.. ఆ సాంగ్ వింటున్నప్పుడు నన్ను నేను ఐడెంటిఫై చేసుకుంటానని అప్పటి ఇంటర్వూలో పలు ఆసక్తికర విశేషాలు వెల్లడించారు పవన్ కళ్యాణ్.. దానికి సంబంధించిన పేపర్ కటింగ్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.. సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.. 2023 వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus