Balayya, Pawan Kalyan: బాలయ్య షో లో పవన్ కళ్యాణ్…బాలయ్య మాటలకు అర్థం అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాల కాలంగా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన బాలకృష్ణ ఇటీవల ఆహా వేదికగా ప్రసారమైన అన్ స్టాపబుల్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ షోలో బాలకృష్ణ వ్యవహరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ షో సూపర్ సక్సెస్ అయ్యింది.

ఈ క్రమంలోనే నిర్వాహకులు అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేశారు. ఇక ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభం కాగా ఈ సీజన్ 2 లో కూడా బాలకృష్ణ వ్యవహరిస్తూన్నాడు. అక్టోబర్ 14వ తేదీన ప్రారంభమైన అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అతని తనయుడు నారా లోకేష్ హాజరయ్యి షో కి మంచి బిగినింగ్ ఇచ్చారు. ఇక తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది.

ఈ ఎపిసోడ్ లో డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డతో పాటు విశ్వక్ సేన్ కూడా హాజరయ్యారు. ఇక ఈ షో లో బాలకృష్ణ తన ప్రశ్నలతో వీరిద్దరికి చమటలు పట్టించాడు. ఇక ఎపిసోడ్ లో యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ కూడా హాజరయ్యాడు. అతనితో కూడ బాలకృష్ణ సరదాగా ముచ్చటించారు. ఇక ఈ క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా బాలకృష్ణ ఫోన్ అందుకొని ” త్రివిక్రమ్ షో కి ఎప్పుడు వస్తున్నావ్ అని అడిగాడు.

మీరు రమ్మంటే ఇప్పుడే వచ్చేస్తాను సార్ అంటూ త్రివిక్రమ్ సమాధానం చెప్పాడు. ఎవరితో రావాలో తెలుసుగా అని బాలయ్య అనగానే అక్కడున్న ఫ్యాన్స్ ఒక్కసారిగ గట్టిగా కేకలు వేస్తూ సందడి చేశారు. అయితే బాలకృష్ణ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తో కలిసి త్రివిక్రమ్ ని షోకి రమ్మని చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఈ షో లో పాల్గొంటే అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus