Mahesh Babu, Pawan Kalyan: మహేష్ బాబుకి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్..!

ఈరోజు(ఆగస్టు 9) మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ లతో పాటు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ లేఖని పోస్ట్ చేశారు. ఈ లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ” ప్రముఖ కథానాయకులు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. శ్రీ కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు.‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి శ్రీ మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిచాం.

‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు శ్రీ మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత శ్రీ మహేష్ బాబు గారిది. కథానాయకుడిగా తనదైన పంథాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న శ్రీ మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు.

గతంలో ఇలా మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ లేఖ రిలీజ్ చేసిన సందర్భాలు లేవు. కానీ మహేష్ బాబు మాత్రం పవన్ కళ్యాణ్ ప్రతీ పుట్టినరోజుకి బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ వేస్తుంటాడు. ‘బహుశా మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కాబట్టి.. పవన్ కళ్యాణ్ ఇలా బర్త్ డే విషెస్ చెప్పి ఉంటాడు’ అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ పవన్ ఇలా మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడం పట్ల..ఈ ఇద్దరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus