షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం “అజ్ఞాతవాసి”. అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్  వారణాసిలో జరిగింది. అక్కడ నుంచే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్  పవన్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ షెడ్యూల్‌లో పవన్ ఇంట్రో సాంగ్‌ని తెరకెక్కించారు. ఈరోజుతో ఈ పాట షూట్ పూర్తి అయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో “అజ్ఞాతవాసి” సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని తెలిపింది. కొన్ని ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని వివరించింది.

ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా సాగుతోందని.. ముందుగా ప్రకటించినట్లుగా జనవరి 10 న అజ్ఞాతవాసి థియేటర్ లోకి తప్పకుండా వస్తాడని స్పష్టం చేసింది.  హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో  కుష్బూ కీలక రోల్ పోషిస్తోంది. విక్టరీ వెంకటేష్ కాసేపు కనిపించి నవ్వులు పూయించనున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ అందించే నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ కానుందని సమాచారం. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus