OG Movie: ఓజీ మూవీ ఆడియో హక్కులు ఏకంగా ఆ రేంజ్ లో అమ్ముడయ్యాయా?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఓజీ సినిమాపై అత్యంత భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా సుజీత్ దర్శకత్వంలో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఆడియో రైట్స్ విషయంలో ఓజీ రికార్డ్ క్రియేట్ చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా ఆడియో రైట్స్ ఏకంగా 20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని భోగట్టా. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75 శాతం పూర్తి కాగా పవన్ 20 రోజుల డేట్లు కేటాయిస్తే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.

ఈ సినిమా ఆడియో అండ్ విజువల్ హక్కులు సోనీ సంస్థ సొంతమయ్యాయని తెలుస్తోంది. ఓజీ ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ అయితే రానున్నాయి. ఏపీలో ఎన్నికలు పూర్తైన వెంటనే పవన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

త్రివిక్రమ్ వైపు నుంచి స్పష్టత వస్తే మాత్రమే ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు అంచనాలను మించి విజయం సాధించగా అజ్ఞాతవాసి సినిమా మాత్రం నిరాశపరిచింది.

పవన్ త్రివిక్రమ్ కాంబోలో పాన్ ఇండియా సినిమా రావాలని ఫ్యాన్స్ ఫీలవుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఓజీ సినిమా (OG Movie) బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus