పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఆయన క్రేజ్ ని ఉదహరిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది ఎవ్వరూ పట్టించుకోరు. కేవలం ఆయనని చూసేందుకు మాత్రమే థియేటర్స్ వస్తారు జనాలు’ అని అంటాడు. రీసెంట్ గా విడుదలైన ‘బ్రో ది అవతార్’ చిత్రం వసూళ్లను చూస్తే అది నిజమే కదా అని అనిపిస్తుంది.
అసలు ఏమాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఆ సినిమా, కేవలం పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించాడు అనే కారణం చేత, మొదటి ఆట నుండి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా, కలెక్షన్స్ పరంగా 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. వేరే హీరో ఈ సినిమా చేసి ఉంటే కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చి ఉండేవి కాదు అని ట్రేడ్ పండితులు చెప్పే మాట.
ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తారీఖున ఆయన కెరీర్ లో ఫ్లాప్ చిత్రం గా పిలవబడే ‘గుడుంబా శంకర్’ ని రీ రిలీజ్ చెయ్యబోతున్నాడు ఆ చిత్ర నిర్మాత నాగబాబు. పుట్టినరోజు నాడు ఫ్లాప్ సినిమాని విడుదల చెయ్యడం ఏమిటి..?, నాగబాబు కి పిచ్చి ఏమైనా పట్టిందా అని అనుకున్నారు ఫ్యాన్స్. అయితే నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ హైదరాబాద్ సిటీ లో పలు ప్రాంతాలలో ప్రారంభించారు. రెస్పాన్స్ అదిరిపోయింది.
మూడు థియేటర్స్ లో టికెట్స్ ఓపెన్ చేస్తే కేవలం పది నిమిషాల వ్యవధి లోనే టికెట్స్ మొత్తం హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి. ఫలితంగా కేవలం అరగంట లోనే 5 వేల టిక్కెట్లు ఆలాకె 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వీటిని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ స్థాయి క్రేజ్ ఈ చిత్రానికి ఉంటుందని ఊహించలేకపోయారు. మరి పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాక ఈ చిత్రం బిజినెస్ మేన్ మొదటి రోజు వసూళ్లను బద్దలు కొడుతుందో లేదో చూడాలి.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్