Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఆ సినిమాకు రీమేక్‌ కాదట.. కొత్త పల్లవి అందుకున్నారుగా!

 

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) .. నిజానికి ఈ సినిమాకు తొలుత అనుకున్న పేరు ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’. వివిధ కారణాల వల్ల ఆ సినిమా టైటిల్‌ను మార్చాల్సి వచ్చింది. ఇంకా చెప్పాంటే టైటిలే కాదు కథే మార్చేశారు. మొత్తంగా ప్రాజెక్ట్‌నే మార్చేశారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తన రాజకీయ కార్యక్రమాలతో బిజీ అవ్వడంతో కథ మార్చేసి.. ఓ తమిళ సినిమాను మాతృకగా తీసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌, సినిమా ప్రేక్షకులు.. ఇలా ఎవరికి అడిగినా ఈ మాటల్ని పొల్లు పోకుండా నిజమే అని చెబుతారు.

Ustaad Bhagat Singh

అయితే.. సినిమా టీమ్‌లో కీలకంగా పని చేసిన వ్యవహరించి వ్యక్తి మాత్రం అబ్బే అదేం లేదు.. ఈ సినిమా రీమేక్‌ కాదు. కేవలం ఒరిజినల్‌ మూవీ నుండి మెయిన్‌ పాయింట్‌ను మాత్రమే తీసుకున్నాం అని చెబుతున్నారట. అందులో ఏముంది అలానే చేశారేమో అని మీరు అనొచ్చు. అయితే గతంలో ఆయనే ‘మా సినిమా రీమేక్‌’ అని చెప్పడం గమనార్హం. దీంతో ఇలా ఎందుకు జరిగిందబ్బా, నిజంగానే కథను మార్చేశారా అనే డౌట్‌ మొదలైంది.

‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ కాస్త ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అవ్వడానికి కారణం సినిమా కథను తమిళ హిట్‌ సినిమా ‘తెరి’, తెలుగులో ఇప్పటికే వచ్చిన ‘పోలీసు’ కథను తీసుకుని మార్చారు అని అప్పట్లో చెప్పారు. అయితే పూర్తి కథ తీసుకోము, కాస్త మాత్రమే అని కొందరు, కాదు కాదు ఫస్టాఫ్‌ మాత్రమే అని మరికొందరు అప్పుడు చెప్పారు. ఈ క్రమంలో సినిమా రచనలో పని చేసిన దర్శకుడు దశరథ్‌ ‘ఈ సినిమా రీమేకే ’ అని అన్నారు.

కానీ ఇటీవల ఆయన మాట్లాడుతూ సినిమాలో ఒక చిన్న పాయింట్‌ మాత్రం ‘తెరి’ నుండి తీసుకున్నాం అని చెప్పారని టాక్‌. దీంతో ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) రీమేక్‌ తేడా కొట్టడం, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ పునర్‌ ప్రారంభానికి సమయం ఉండటంతో కథలో ఏమైనా మార్పులు చేసి.. బ్లాక్‌బస్టర్‌ కోసం ఏర్పాట్లు చేశారా అనే చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ దర్శకుడు హరీశ్‌ శంకరే (Harish Shankar) ఇవ్వాలి.

వెంకటేష్ 76 మూవీకి అనిల్ పారితోషికం ఎంతో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus