హీరో సుశాంత్ సింగ్ ఆత్మ హత్య నేపథ్యంలో అనేకమంది బాలీవుడ్ తో తమకు గల చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ సైతం ఈ విషయంపై స్పందించారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఆమె బాధను వెళ్లగక్కారు. పాయల్ కూడా సుశాంత్ వలె బుల్లితెర నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఆమె మాట్లాడుతూ…”ఇండస్ట్రీలో ఒకప్పుడు నన్ను కూడా దూరం పెట్టారు. నువ్వు హీరోయిన్ గా పనికిరావని ఎవరైనా అన్నప్పుడు గుండె పగిలిపోయేది.
అలాంటి టైమ్ లో ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. వారన్న మాటలు నన్ను బాగా ఇబ్బంది పెట్టేవి. ఎంతో కుంగిపోయాను కూడా.కానీ నేను ఆత్మహత్య చేసుకోవడం గురించి ఆలోచించలేదు. ఎప్పుడైనా సరే మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మీ మనసు లోపల దాగిన కష్టాలను.. కలిగిన నష్టాలను.. మీలోని బలహీనతలు ఇతరులతో పంచుకోవాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి కావాల్సిన వాళ్లకి బాధలు చెప్పుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు” అని పాయల్ చెప్పుకొచ్చారు.
2010లో నటిగా బుల్లితెరకు పరిచయమైన పాయల్ 2017 లో ఓ పంజాబీ చిత్రం ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ ఆతరువాత వీరిది వెడ్డింగ్ అనే హిందీ మూవీలో ఓ ప్రాధాన్యం ఉన్న రోల్ చేసింది. తెలుగులో ఆమె నటించిన ఆర్ ఎక్స్ 100 మంచి బ్రేక్ ఇచ్చింది.కొన్ని పంజాబీ చిత్రాలలో నటించిన పాయల్ బాలీవుడ్ లో మాత్రం రాణించలేక పోయింది. ఆమె ఫోకస్ మొత్తం సౌత్ పైనే ఉంది. తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న పాయల్ తమిళంలో ఓ కామెడీ హార్రర్ చేస్తుంది.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!