Payal Rajput: ప్రభాస్ గురించి పాయల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్  (Prabhas)  పెళ్లికి సంబంధించిన తీపికబురు చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ కు సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ ఆ సినిమాలతో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకుంటాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అయితే వ్యక్తిగత జీవితం గురించి చాలా సందర్భాల్లో ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ప్రభాస్ గురించి హీరోయిన్ పాయల్(Payal Rajput)  తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ నటి పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ ఇప్పటివరకు నేను చాలా అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు. ఐఫా, సైమా, ఇతర ఈవెంట్లలో సందడి చేశానని ఆమె వెల్లడించారు. ఫిల్మ్ ఫేర్ కు హాజరు కావడం మాత్రం ఇదే తొలిసారి అని పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చారు. సినిమాను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదే మంచి ఫ్లాట్ ఫామ్ అని పాయల్ రాజ్ పుత్ వెల్లడించడం గమనార్హం.

వేర్వేరు భాషలకు చెందిన నటీనటులను ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. తనపై వచ్చిన ఫన్నీ రూమర్ గురించి పాయల్ స్పందిస్తూ ప్రభాస్ తో నా పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయని వాటిని చూసి బాగా నవ్వుకున్నానని ఆ వార్తలు నిజమైతే బాగుంటుందని అనుకున్నానని పాయల్ రాజ్ పుత్ కామెంట్లు చేయడం గమనార్హం.

ప్రస్తుతం నా లైఫ్ ఆనందంగా ఉందని నా చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తున్నానని ఆమె తెలిపారు. వాళ్లు నాపై చూపించే ప్రేమాభిమానాల వల్ల జీవితం మరింత అందంగా మారిందని పాయల్ రాజ్ పుత్ పేర్కొన్నారు. గోల్ మాల్, ఏంజెల్, కిరాతక సినిమాలతో పాయల్ రాజ్ పుత్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రభాస్ అంటే ఎంతో అభిమానమని పాయల్ రాజ్ పుత్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus