Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ను మోసం చేసిన డైరెక్టర్లు ఎవరు?

‘ఆర్.ఎక్స్.100’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమాలో ఆమె చేసిన బోల్డ్ సన్నివేశాలు, లిప్ లాక్ సన్నివేశాలు.. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. పాయల్ వల్ల ఇలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఇంట్రెస్ట్ చూపించారు. ఆ రకంగా పాయల్ ఓ ట్రెండ్ సెట్ చేసిందని చెప్పొచ్చు. అయితే ‘ఆర్.ఎక్స్.100 ‘ లో ఎక్స్పోజింగ్ తో పాటు నటనతో కూడా ఈమె ఆకట్టుకుంది.

కానీ ఈమె (Payal Rajput) గ్లామర్ యాంగిల్ మాత్రమే హైలెట్ అయ్యింది. ‘వెంకీ మామ’ ‘డిస్కో రాజా’ ‘జిన్నా’ ‘తీస్ మార్ ఖాన్’ వంటి సినిమాల విషయాల్లో కూడా ఈమెను కేవలం గ్లామర్ కి మాత్రమే వాడుకున్నారేమో అనిపిస్తుంది. అందుకే పాయల్ స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. ఇదే విషయాన్ని పాయల్ కూడా అంగీకరించింది. అలాగే ఇదే సమయంలో డైరెక్టర్ల గురించి నెగిటివ్ కామెంట్లు కూడా చేసింది. పాయల్ మాట్లాడుతూ.. “నేను చేసే ప్రతి సినిమాకి 200 శాతం ఎఫర్ట్స్ పెడుతుంటాను.

కానీ ఫలితం నా చేతుల్లో ఉండదు. అది డెస్టినీపై ఆధారపడి ఉంటుంది. ‘ఆర్.ఎక్స్.100 ‘ తర్వాత నన్ను మిస్ లీడ్ చేశారు. డైరెక్టర్లు నన్ను బాగా వాడుకున్నారు.అప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ‘ఎక్కడికి వెళ్ళాలి.. ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి.. ఏం చేయకూడదు’.. వంటి విషయాలు తెలిసొచ్చాయి. భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తాను. ” అంటూ పాయల్ చెప్పుకొచ్చింది. అయితే తనని మోసం చేసిన డైరెక్టర్ల గురించి మాత్రం పాయల్ చెప్పలేదు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus