Payal Rajput: ‘ఆర్.ఎక్స్ 100’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే..!

ఆర్.ఎక్స్.100 చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. అజయ్ భూపతి దర్శకుడిగా మారుతూ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బయ్యర్స్ కి 5 రెట్లు లాభాలను అందించింది ఈ చిత్రం. ఆర్.ఎక్స్.100 చిత్రం పెద్ద సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ హీరోయిన్ పాత్ర. ఆ సినిమా కథ మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. కామంతో, విరహవేదనతో రగిలిపోయే ఓ అమ్మయి ప్రేమ పేరుతో ఓ అబ్బాయిని పడక సుఖం కోసం వాడుకోవడం అనేది అప్పటికి జనాలకి కొత్త ఫీలింగ్ ను కలిగించింది.

అలాంటి ఛాలెంజింగ్ రోల్ ను పాయల్ చాలా బాగా హ్యాండిల్ చేసింది అని చెప్పాలి. గ్లామర్ తోనే కాకుండా , నెగిటివ్ రోల్ తో కూడా బాగా మెప్పించింది. అయితే ఈ చిత్రానికి హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ పాయల్ కాదట. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నందిత శ్వేతాని అనుకున్నాడట దర్శకుడు అజయ్ భూపతి. కానీ ఆమె ఈ పాత్రని రిజెక్ట్ చేసింది.

కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న నందిత శ్వేత హద్దులు మీరిన గ్లామర్ షో, ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ఇష్టపడలేదు. అందుకే ‘ఆర్.ఎక్స్.100 ‘ చిత్రాన్ని ఆమె రిజెక్ట్ చేసింది అనుకోవచ్చు. ఆమె లేటెస్ట్ మూవీ ‘హిడింబ’ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని రివీల్ చేసింది నందిత శ్వేత.

అజయ్ భూపతి గారి ఆర్.ఎక్స్.100 సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాను. (Payal Rajput) పాయల్ ఆ సినిమాకి వంద శాతం న్యాయం చేసింది. ఇప్పుడు ‘మంగళవారం’ సినిమాలో నటిస్తున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus