Peddha Kapu 1: ఓటీటీకి వచ్చేసిన ‘పెదకాపు 1’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

గత నెల అంటే సెప్టెంబర్ 28, 29 టైంలో ‘స్కంద’ ‘పెదకాపు 1’ ‘చంద్రముఖి 2’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ ‘సలార్’.. పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మూడు కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమాలే అనుకోవాలి. అయితే ‘చంద్రముఖి 2’ ‘పెదకాపు 1’ సినిమాలు మొదటి షోతోనే డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ‘స్కంద’ సినిమా మిక్స్డ్ టాక్ మూటగట్టుకున్నప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి.

రామ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది ఆ చిత్రం. ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తే.. ఆ టైంకి అదే బెటర్ అనిపించింది ప్రేక్షకులకి..! ఇక ‘స్కంద’ సినిమా ఈరోజు నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆ సినిమా ఓటీటీకి రాలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లనే ‘స్కంద’ ఓటీటీకి రాలేదు అని తెలుస్తుంది. అయితే ఊహించని విధంగా ‘పెదకాపు 1’ ఓటీటీకి వచ్చేసింది.

శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన (Peddha Kapu 1) ఈ సినిమాని ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం టైటిల్ దగ్గరుండే అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్, ట్రైలర్ కూడా బాగుండటంతో.. సినిమా పబ్లిసిటీకి మరింత ప్లస్ అయ్యింది అని చెప్పాలి. కానీ ఎప్పుడైతే ప్రీమియర్స్ వేశారో.. అప్పుడే నెగిటివ్ టాక్ బయటకు వచ్చింది.

దీంతో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా సినిమాకి రాలేదు. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలని కొంతమంది ప్రేక్షకులు ఆశగా ఎదురు చూశారు. ఇక ఈరోజు నుండి ‘పెదకాపు 1’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చూడొచ్చు

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus