పెంగ్విన్ మూవీతో పెద్ద సాహసమే చేస్తున్న కీర్తి సురేష్

కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉన్న కీర్తి సురేష్ పరఫార్మెన్సు ఓరియెంటెడ్ పాత్రలతో ముందుకు వెళుతుంది. ఎంత గొప్ప నటి అయినా గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోకపోతే కెరీర్ కి అంత మైలేజ్ ఉండదు. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న నయనతార, త్రిష, కాజల్, తమన్నా లాంటి వారు ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసినవారే. కీర్తి ఏడేళ్లుగా హీరోయిన్ గా చేస్తున్నా.. ఆమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా మహానటి మాత్రమే.

స్టార్ హీరో పవన్ తో చేసిన అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ గా మిగిలింది. ఏది ఏమైనా ఆమె ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ముందుకు వెళుతుంది. ఆమె లేటెస్ట్ మూవీ పెంగ్విన్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుండగా ఆ మూవీలో ఆమె గర్భవతిగా, ఓ పిల్లాడి తల్లిగా కనిపించనుంది. మరి ఇలాంటి పాత్రలు చేయడం ఫార్మ్ లో ఉన్న ఏ హీరోయిన్ కి అయినా కొంచెం రిస్క్ అనే చెప్పాలి. ఇలాంటి పాత్రలకు నటన పరంగా ప్రేక్షకుల ప్రశంశలు దక్కినా స్టార్ హీరోయిన్ హోదా అయితే వదులుకోవలసిందే.

ఎందుకంటే అలాంటి పాత్రలు చేశాక స్టార్ హీరోలు తమ చిత్రాల్లో హీరోయిన్ గా తీసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి పెంగ్విన్ సినిమా ద్వారా కీర్తి పెద్ద సాహసమే చేస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఇక కీర్తి చేతిలో దాదాపు అరడజను సినిమాలకు వరకు ఉండగా, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి అనే రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus