ప్రభాస్‌ సినిమా అంటే అందరూ పక్కకు జరగాలా? ఇదేం లాజిక్‌?

సంక్రాంతికి ఐదారు సినిమాలు రెడీ అయితే ఎలా ఉంటుందో ఈ ఏడాది చూశాం. మొత్తంగా నాలుగు పెద్ద సినిమాలు, ఒక చిన్న (?) సినిమా వస్తాం అనుకున్నాయి. అయితే వివిధ చర్చల తర్వాత నాలుగు సినిమాలే బరిలో మిగిలాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఇలాంటి పరిస్థితే ఉంది అంటున్నారు. నలుగురు అగ్ర సీనియర్‌ హీరోలు రెడీగా ఉండగా… ‘జై హనుమాన్‌’ తెస్తామని ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే చెప్పేశారు. అయితే అదే టైమ్‌లో ప్రభాస్‌ సినిమా కూడా తీసుకొస్తామని ఇప్పుడు నిర్మాత అంటున్నారు. అంతేకాదు దానికో లాజిక్‌ కూడా చెప్పారాయన.

టాలీవుడ్‌లో ప్రస్తుతం పెద్ద నిర్మాణ సంస్థలు అంటూ ఓ లిస్ట్ రాస్తే అందులో కచ్చితంగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కచ్చితంగా ఉంటుంది. ఆ సంస్థ నుండి ఈ ఏడాది 15 సినిమాలు వస్తాయి అని చెబుతున్నారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌. అంతేకాదు తమ నిర్మాణ సంస్థలో మొత్తంగా 40 సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి అని చెబుతున్నారు. వీలైనంత త్వరగా వంద సినిమాల మైలురాయిని అందుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు కూడా.

మా సంస్థ  (People Media Factory) నుండి ఈ ఏడాది వచ్చే సినిమాల్లో ఒకట్రెండు ఓటీటీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సగటున నెలకొక సినిమా రిలీజ్ చేస్తాం అని చెప్పారు. ఇక ప్రభాస్‌తో తాము రూపొందిస్తున్న ‘రాజా సాబ్’ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నామని చెప్పారు. అతే దాని కోసం బెర్తు బుక్ చేయాల్సిన పని లేదని క్లారిటీ ఇచ్చారాయన. ఎందుకంటే ప్రభాస్ సినిమా అంటే ఆటోమేటిగ్గా ఒక బెర్త్ ఉంటుందని విశ్వప్రసాద్ తెలిపారు.

దీంతో ఇదెలా సాధ్యం. ప్రభాస్‌ సినిమాకు ఒక స్లాట్‌ పక్కాగా పెట్టుకునే ఆప్షన్‌ టాలీవుడ్‌లో ఎవరు ఎవరికిచ్చారు అనే చర్చ మొదలైంది. అలా అయితే ప్రతి హీరో ఇలానే అనుకోవచ్చు. ప్రతి నిర్మాత ఇలానే అనుకోవచ్చు అంటున్నారు. అయితే నిర్మాత విశ్వప్రసాద్‌ ఏ ఆలోచనతో అలా అన్నారో ఆయనే చెప్పాలి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus