తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి.. మహానటి అయిన జయలలిత గారి బయోపిక్ ను ప్రస్తుతం సినిమాలుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇద్డరు దర్శకులు సినిమాలని తెరకెక్కిస్తుండగా.. ఒక దర్శకుడు వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు. అయితే వీటిని వ్యతిరేకిస్తూ.. జయలలిత మేనకోడలు దీప జయకుమార్ కేసు వేసింది. ‘అమ్మ’ జీవిత కథను తప్పుగా తెరకెక్కిస్తున్నారని.. నిజాలు చూపించకుండా కల్పితాలు జోడించి ఆమెను అవమానిస్తున్నారని మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
వెంటనే ఆ దర్శకులు.. ‘అమ్మ’ బయోపిక్ లను నిలిపి వేయాల్సిందిగా ఆమె పిటిషన్ లో కోరింది. అయితే హైకోర్టు ఈమెకు షాకిచ్చింది. దీప జయకుమార్ పాత్రను మాత్రం సినిమాల్లో లేదా వెబ్ సిరీస్ లలో చూపించకూడదని ఆదేశాలు జారీ చేసి.. ఈమె పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో అమ్మ జీవితంతో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు తెరకెక్కిస్తోన్న మేకర్స్ కు లైన్ క్లియర్ అయినట్టు అర్థం స్పష్టమవుతుంది. అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదలకుండా ‘సుప్రీమ్ కోర్టుకు తీసుకెళ్తానని’ ఈమె చెబుతున్నట్టు కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.
వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!