Pilla Nuvvu Leni Jeevitham Collections: ‘పిల్లా నువ్వు లేని జీవితం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ డెబ్యూ మూవీగా ‘రేయ్’ రూపొందింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమాగా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ రిలీజ్ అవ్వడం జరిగింది. 2014 నవంబర్ 14న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ‘గీతా ఆర్ట్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లపై బన్నీ వాస్, హర్షిత్ రెడ్డి..లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

మొదటి షోతోనే ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ‘#9YearsForPNLJ’ ‘#9YearsForSDTInTFI’ అనే హ్యాష్ ట్యాగ్..లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 3.80 cr
సీడెడ్ 1.80 cr
ఉత్తరాంధ్ర  1.30 cr
ఈస్ట్ 0.77 cr
వెస్ట్ 0.57 cr
గుంటూరు 0.90 cr
కృష్ణా 0.70 cr
నెల్లూరు 0.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 10.19 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.80 cr
ఓవర్సీస్ 0.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 11.09 cr (షేర్)

‘పిల్లా నువ్వు లేని జీవితం’ (Pilla Nuvvu Leni Jeevitham) చిత్రానికి రూ.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.11.09 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.1.09 కోట్లు ప్రాఫిట్స్ తో డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఆ రకంగా సాయి ధరమ్ తేజ్ మొదటి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నట్టు అయ్యింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus