Pindam: సైలెంట్ గా బ్రేక్ ఈవెన్ అయిపోయిన ‘పిండం’ మూవీ!

ఈ మధ్య కాలంలో ఒక చిన్న సినిమా రిలీజ్ అవ్వడమే కష్టంగా ఉంది. రిలీజ్ అయినా నామమాత్రంగానే రిలీజ్ అవుతుంది అనే అభిపాయాలు కూడా జనాల్లో ఉంటున్నాయి. అలాంటి చిన్న సినిమాలకి మంచి టాక్ వచ్చినా థియేటర్ వరకు జనాలు వచ్చే పరిస్థితి లేదు. ‘ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చులే’.. అని చాలా మంది సరిపెట్టుకుంటారు. అలాంటిది సరిగ్గా తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటే.. థియేటర్లకు జనాలని రప్పించొచ్చు అని ఓ చిన్న సినిమా నిరూపించింది.

అదే ‘పిండం’ సినిమా. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ చిన్న సినిమా డిసెంబర్ 15 న రిలీజ్ అయ్యింది. సాయి కిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాని ‘కళాహి మీడియా బ్యానర్‌’ పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. ఇది హారర్ జానర్లో రూపొందిన సినిమా. ఓ పక్క ‘యానిమల్’ ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. మరోపక్క ‘సలార్’ వంటి పెద్ద సినిమాపై ప్రేక్షకుల ఫోకస్ ఉంది.

ఇలాంటి టైంలో ‘ ‘పిండం’ అనే నెగిటివ్ టైటిల్ తో వచ్చిన సినిమాని జనాలు పట్టించుకుంటారు’ అని ఎవ్వరూ ఊహించరు. కానీ ఈ సినిమా సైలెంట్ గా సక్సెస్ అందుకుంది. చాలా వరకు ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ థియేటర్ రెంట్లు వంటి వాటితో రూ.80 లక్షల షేర్ ను రాబట్టాలి.

ఇది ఓ చిన్న సినిమాకి.. ఇలాంటి పరిస్థితుల్లో ఈజీ టాస్క్ కాదు. కానీ (Pindam) ‘పిండం’ సినిమా రూ.1.07 కోట్ల వరకు షేర్ ను రాబట్టి.. డీసెంట్ హిట్ గా నిలిచింది. ‘చిన్న సినిమాలను జనాలు పట్టించుకోవడం మానేశారు’ అనుకునే వాళ్లకి కూడా ఈ సినిమా పెద్ద గట్టి సమాధానం చెప్పింది అని చెప్పొచ్చు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus