Bigg Boss 5 Telugu: నామినేషన్స్ కంటే ప్రియాంక లవ్ ట్రాక్ హైలెట్ అవ్వబోతోందా..?

  • November 22, 2021 / 10:24 AM IST

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అనేవి ఎప్పుడూ హీటెక్కిస్తాయి. 12వ వారం నామినేషన్స్ లో భాగంగా హౌస్ మేట్స్ దిష్టిబొమ్మలపై కుండలు పెట్టి వాటిని పగలగొడతూ నామినేట్ చేయాలి. ఒక్కొక్కరు వచ్చి ఇద్దరిని నామినేట్ చేస్తూ తగిన రీజన్స్ చెప్పాలి. ఇక్కడే నామినేషన్స్ లో పింకీకి ఒక్క ఓటు పడిందని చెప్తున్నారు. అయినా కూడా ఈవారం తను నామినేషన్స్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఫ్యామిలీ మీట్స్ ఈవారం జరగబోతున్నాయని, పింకీ వాళ్ల నాన్న రాకతో ఎపిసోడ్ ఎమోషనల్ గా హైలెట్ గా మారబోతోందని చెప్తున్నారు.

ఇక నామినేషన్స్ కంటే కూడా మానస్ కి పింకీ ప్రపోజ్ చేయడం అనేది హౌస్ ని బాగా హీటెక్కించిదని చెప్తున్నారు. సండే రోజు సన్నీ అడిగిన ప్రశ్నకి మానస్ ఆన్సర్ ఇచ్చాడు. పింకీతో బయటకి వెళ్లిన తర్వాత నీ రిలేషన్ ఎలా ఉంటుందని సన్నీ మానస్ కి ప్రశ్న వేశాడు. దీంతో మానస్ మంచి ఫ్రెండ్ గా ఉంటానని చెప్పాడు. ఇక నాగార్జున పింకీతో మానస్ నుంచీ నువ్వు ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నావ్ అంటూ స్ట్రయిట్ గా అడిగాడు. దీనికి తను ఫ్రెండ్షిప్ ఆశిస్తున్నానని చెప్పింది.

ఇక్కడే సిరికి కూడా కౌంటర్ వేసింది ప్రియాంక. ఇక ఇదే మూడ్ ని క్యారీ చేసిన ప్రియాంక మానస్ కి ప్రపోజ్ చేసినట్లుగా సమాచారం.తను నామినేషన్స్ లోకి వచ్చింది కాబట్టి, ఒకవేళ ఈవారం వెళ్లిపోతే ఎప్పటికీ చెప్పలేనేమో అనే ఫీలింగ్ ని దాచుకుని మానస్ తో తన మనసులో మాటని బయటపెట్టిందట. అంతేకాదు, అన్నం తినకుండా ఏడుస్తూ కూర్చున్న పింకీని మానస్ వెళ్లి బ్రతిమిలాడి అన్నం తినిపించాడని, నామినేషన్స్ కంటే కూడా వీళ్లిద్దరే ఎపిసోడ్ లో హైలెట్ అయ్యారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus