మరో ఆసక్తికరమైన చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది. మన దేశంలో అరుదుగా వచ్చే వార్ బ్యాక్‌డ్రాప్ లో ఈ సినిమా రూపొందడం విశేషం. 1971 ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ద విజయంలో కీలక పాత్ర పోషించిన ’పిప్పా‘ 1971అనే యుద్ద ట్యాంకు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో అక్షయ్ కుమార్ తో ఎయిర్ లిఫ్ట్ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా రోనీ స్క్రూవాలా , సిద్ధార్థ కపూర్ నిర్మించారు.
పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న బ్రిగేడియర్ బలరాం సింగ్ మెహతా తనే స్వయంగా రాసిన బుక్ ’ది బర్నింగ్ చాఫ్పిస్‘ పుస్తకం ఆధారంగా తీసిన ఈ ’పిప్పా1971‘ సినిమాలో షాహీద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించగా ఆయనకు సోదరిగా మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్ర పోషించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా షూటింగ్ 2021లో ప్రారంభమైపనప్పటికీ అన్ని అవరోధాలను దాటుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు గురువారం (Pippa 1971) సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా అది అందరినీ ఆకట్టుకుంటున్నది. అయితే అశ్చకర్యకరంగా సినిమాను థియేటర్లలో కాకుండా నవంబర్ 10 న డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!