బాహుబలి కంక్లూజన్ ని వెంటాడుతున్న కష్టాలు

బాహుబలిని తెరకెక్కించడానికి ఐదేళ్లపాటు శ్రమించిన రాజమౌళి బృందానికి రిలీజ్ అయిన తర్వాత కూడా కష్టాలు తప్పడం లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8 వేల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ  అందరి ప్రశంసలు అందుకుంటుంటే.. కొంతమంది ఈ సినిమాను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచుతున్నారు. మరికొంత మంది ఏకంగా పైరసీ వీడియోలను సైట్లలో పెడుతున్నారు. వీరి ఆగడాలను అరికట్టడానికి చిత్ర బృందం రంగంలో దిగింది.

‘బాహుబలి 2’ పైరసీ లింకులు బ్లాక్‌ చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్నెట్‌ లో ఈ సినిమా సంబంధించి పైరసీ లింకులు తెలిస్తే తమకు సమాచారం అందించాలని రాజమౌళి బృందం కోరింది. blockxpiracy.com, apfilmchamber.comలకు లింకులు పంపాలని విజ్ఞప్తి చేసింది. పైరసీ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఈ సినిమాను ధియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులను కోరింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus