సౌత్ లో ఉన్న టాప్ పైరసీ వెబ్ సైట్ లలో మొదటి స్థానంలో ఉంటుంది తమిళ రాకర్స్. ఈ వెబ్ సైట్ లో తమిళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలను కూడా పైరసీ చేసి రిలీజ్ చేసేవారు. దాదాపు దశాబ్దంన్నరగా ఈ పైరసీ వెబ్ సైట్ నిర్మాతలను ఇబ్బంది పెడుతోంది. సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ చేసి వాళ్ల వెబ్ సైట్ లో పెడుతుంటుంది తమిళ రాకర్స్. పైరసీ కాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎలాగోలా తమిళ రాకర్స్ పైరసీ వెర్షన్ ని రిలీజ్ చేసేది. పోలీసులు ఎంతగా నియంత్రించడానికి ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది.
కోలీవుడ్ ప్రముఖులు చాలా మంది ఈ వెబ్ సైట్ పని పట్టాలని ప్రయత్నించారు. విశాల్ లాంటి హీరోలు చాలానే ప్రయత్నించారు. కానీ ఈ వెబ్ సైట్ నిర్వాహకులు తమ సబ్‌స్క్రైబర్లకు మెయిల్ ద్వారా పైరసీ లింకులు పంపించి వాళ్లను ఎంగేజ్ చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ సంస్థ.. తమిళ రాకర్స్ కి షాకిచ్చింది. ప్రైమ్ లో వచ్చే కొత్త సినిమాలను కూడా ఈ వెబ్ సైట్ పైరసీ చేసి తమ సబ్‌స్క్రైబర్లకు అందిస్తున్నట్లు తెలుసుకున్న ప్రైమ్.. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి ఈ వ్యవహారాన్ని డీల్ చేసింది.
వాళ్లు వెబ్ సైట్ సర్వర్లన్నింటినీ బ్లాక్ చేయడంతో తమిళ రాకర్స్ కి గట్టి దెబ్బ తగిలింది. ఏం చేయాలో తోచని స్థితిలో తమిళ రాకర్స్ తమ సబ్‌స్క్రైబర్లకు ఓ మెయిల్ పంపించింది. ఇకపై కొత్త సినిమాల పైరసీ వెర్షన్లు అందించలేమని.. తమ సర్వర్లన్నీ బ్లాక్ అయిపోయాయని.. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని మెయిల్ లో పేర్కొన్నారు. మొత్తానికి కోలీవుడ్ చేయలేని పని అమెజాన్ సంస్థ చేసి నిర్మాతలకు, సినిమాలకు ఎంతో మేలు చేసిందని.. ప్రసంశలు కురిపిస్తున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!