పిట్టగోడ

  • December 24, 2016 / 12:37 PM IST

“ఉయ్యాల జంపాల” నిర్మాత రామ్ మోహన్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించిన తాజా చిత్రం “పిట్టగోడ”. దర్శకుడితో సహా నటీనటులు సైతం అందరూ కొత్తవారితోనే తెరకెక్కించబడిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా నేడు (డిసెంబర్ 24) విడుదలైంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!

కథ : టిప్పు (విశ్వ) అండ్ గ్యాంగ్ (శ్రీహన్, జబర్దస్త్ రాము, కె.ఎస్.రాజు) గోదావరిఖని లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ప్లే గ్రౌండ్ లోని “పిట్టగోడ” మీద కూర్చొని సరదాగా జీవితం గడిపేస్తుంటారు. అయితే.. పేపర్ లో తమ ఫోటో పడాలనే ఉద్దేశ్యంతో ఒక క్రికెట్ టోర్నమెంట్ ను ఆర్గనైజ్ చేస్తారు. అయితే.. అప్పుడే వాళ్ళ వీధిలోకి కొత్తగా వచ్చిన దివ్య (పునర్నవి భూపాలం) కారణంగా టోర్నమెంట్ ను క్యాన్సిల్ చేస్తాడు టిప్పు. అసలు టిప్పు క్రికెట్ టోర్నమెంట్ ను క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి? దివ్యకి టిప్పుకి ఉన్న సంబంధం ఏమిటి? అనేది “పిట్టగోడ” సినిమాలోని కీలకాంశం.

నటీనటుల పనితీరు : టిప్పుగా విశ్వ, అతడి స్నేహితులుగా శ్రీహన్, జబర్దస్త్ రాము, కె.ఎస్.రాజులు చాలా పేలవమైన నటన ప్రదర్శించారు. సన్నివేశంలోని ఎమోషన్ ను నామమాత్రంగానైనా తెరపై చూపించలేకపోయారు. సినిమాలోని నటీనటుల్లోకెల్లా సీనియర్ అయిన పునర్నవి భూపాలం మాత్రం అచ్చమైన తెలుగమ్మాయిలా స్వచ్చమైన భావాలను వెండితెరపై ఆవిష్కరించింది. మిగిలిన నటీనటుల గురించి చెప్పుకోవడానికేమీ లేదు.

సాంకేతికవర్గం పనితీరు : “ప్రాణం” కమలాకర్ సంగీతం పాటలు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది. ఇక నేపధ్య సంగీతం అయితే ఇటీవల విడుదలైన రెండుమూడు సినిమాల నుంచి లేపేశాడేమో అనిపించకమానదు. ఉదయ్ సినిమాటోగ్రఫీ క్వాలిటీపరంగా బాగుంది. ఎడిటింగ్ కి పెద్దగా స్కోప్ లేకుండా ఉంది కథనం. నిర్మాణ విలువలు బాగోలేవు. తక్కువ మొత్తంలో సినిమాను చుట్టేద్దామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రామ్మోహన్ సినిమా మేకింగ్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం అవుట్ పుట్ ను దెబ్బతీసింది. దర్శకుడు అనుదీప్ కె.వి రాసుకొన్న కథలో కంటెంట్ లేదు. స్క్రీన్ ప్లేలో పసలేదు. ఓవరాల్ గా సినిమాలో విషయం లేదు. కథలో కనీస స్థాయి లాజిక్ లేక సినిమా చూస్తున్న ఆడియన్ “అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది” అనే విషయం అర్ధం కాక థియేటర్ లో మిన్నకుండిపోతాడు.

విశ్లేషణ : కొత్త కుర్రాళ్ళు నటించిన సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనా లేకపోయినా.. రామ్మోహన్ లాంటి నిర్మాత నిర్మించడంతోపాటు, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే.. సినిమా ఆ అంచనాల్ని తలకిందులు చేసింది. మరీ పనీపాటా లేకుండా ఉంటే తప్పితే “పిట్టగోడ” చిత్రాన్ని చూడకపోవడమే ఉత్తమం!

రేటింగ్ : 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus