మన ప్రేక్షకులకు రెగ్యులర్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసి బయోపిక్స్ మీద ఆసక్తి చూపడం మొదలెట్టిన మరుక్షణం నుంచి మన దర్శకనిర్మాతలందరూ బయోపిక్స్ మీద పడ్డారు. “మహానటి, యాత్ర” తప్పితే మరో బయోపిక్ హిట్ అయిన దాఖలాలు లేవు. కానీ.. మనోళ్ళు మాత్రం ఎందుకనో వరుసబెట్టి బయోపిక్స్ తీసుకుంటూనే వెళ్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు” చిత్రాల రిజల్ట్స్ ఏమైంది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే.. మిగతా బయోపిక్స్ కూడా అలాగే తయారయ్యాయి.
రీసెంట్ గా రిలీజైన మోడీ బయోపిక్ ది కూడా అదే స్థితి. నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా రూపొందిన “పిఎం నరేంద్రమోడీ” చిత్రం బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. ఎలక్షన్స్ లో మోడీ భారీ విజయం అనంతరం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ సాధిస్తుందని ఊహించినవాళ్ళందరూ షాక్ అయ్యారు. దాంతో జనాలకి పోలిటికల్ ఎంటర్ టైనర్స్ అంటే ఆసక్తి లేదని అర్ధమైపోయింది. మరి ఇప్పటికైనా మన దర్శకులు మారతారో లేదో చూడాలి.