గత మూడ్రోజులుగా జానీ మాస్టర్ (Jani Master) పై వస్తున్న వార్తల కారణంగా ఇప్పటికే సోషల్ మీడియా & ఇండస్ట్రీలో అతని కెరీర్ అయిపోయింది అని అందరూ ఒక తీర్మానానికి వచ్చేసారు. అయితే.. ఇప్పటివరకు అతడిపై వచ్చిన ఆరోపణలకు మహా అయితే కొన్నాళ్ల జైలు శిక్ష మరియు జరిమానా ఉండొచ్చు అనుకున్నారు. ఆల్రెడీ చాలా సినిమాలు చేసి సంపాదించాడు కాబట్టి కెరీర్ లేకపోయినా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ బ్రతికేస్తాడులే అనుకున్నారు జనాలు.
కట్ చేస్తే.. ఇవాళ జానీ మాస్టర్ మీద పోక్సో (POSCO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుత భారతీయ చట్టాల్లో అన్నిటికంటే పటిష్టమైన, ప్రమాదకరమైన చట్టమిది. ఈ కేసులో ఎంతటివాడినైనా బెయిల్ రాకుండా అరెస్ట్ చేసే వెసులుబాటు ఉంది. అంతేకాక.. కేస్ ప్రూవ్ అయితే గనుక 20 ఏళ్ల జైలు శిక్ష లేదా సీరియస్ క్రైమ్ అయితే ఏకంగా ఉరి శిక్ష విధంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పోక్సో కేసు నుండి జానీ మాస్టర్ బయటపడే అవకాశమే లేదు.
ఎందుకంటే.. కన్సెంట్ (ఇష్టపూర్వకంగానే) లైంగికంగా కలిశామని ప్రూవ్ చేసిన కూడా.. సదరు కార్యకలాపాలు చేసే సమయానికి ఆమె వయసు 18 లోపు అని ప్రూవ్ చేయగలిగితే ఎలాంటి సంకోచం లేకుండా జానీ మాస్టర్ ను జైల్లో పెట్టి జీవిత ఖైదు వేయడం కన్ఫర్మ్. ఈ కేసుల నుంచి జానీ న్యాయంగా బయటపడే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఇప్పటికీ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
దాదాపు నాలుగు పోలీస్ బృందాలు అతడి కోసం వెతుకుతున్నాయి. ఇలాగే ఇంకొన్ని రోజులు దాక్కోవడాలు గట్రా చేశాడంటే పోలీసుల్లో మాత్రమే కాక జనాల్లోనూ కోపం పెరిగి బయట పొరపాటున కనిపించినా కొట్టి చంపేసే అవకాశాలున్నాయి. అందువల్ల జానీ అర్జెంటుగా పోలీసులకు లొంగిపోవడం శ్రేయస్కరం. మరి జానీ ఏం డిసైడ్ అయ్యి ఇంకా దాక్కుంటున్నాడో అతడికే తెలియాలి!