Pokiri Collections: ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్

  • April 28, 2024 / 09:03 PM IST

అప్పటివరకు ప్రిన్స్ అంటూ పిలుచుకునే మహేష్ బాబుకి (Mahesh Babu) సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను కట్టబెట్టిన సినిమా ‘పోకిరి’ (Pokiri). పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ సోదరి మంజుల (Manjula Ghattamaneni) .. పూరితో కలిసి నిర్మించింది.కేవలం 108 రోజుల్లో తీసిన మూవీ ఇది. ఆ టైంకి పూరి జగన్నాథ్ ఫామ్లో లేడు. ‘సూపర్” (Super) పెద్దగా ఆడలేదు. దానికి ముందు వచ్చిన ‘143’ పరిస్థితి కూడా అంతే..! అలాంటి టైంలో అంటే 2006 ఏప్రిల్ 28 న వచ్చిన ‘పోకిరి’ పై మొదట ప్రేక్షకుల్లో అంచనాలే లేవు.

మరోపక్క బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘వీరభద్ర’ (Veerabhadra) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘బంగారం’ (Bangaram) వంటి బడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అని ‘పోకిరి’ ని చాలా మంది ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. మొదటి రోజు ‘పోకిరి’ సినిమాకి 40 శాతం ఆక్యుపెన్సీలే ఉన్నాయి అంటే అతిశయోక్తి అనిపించుకోదు. కానీ క్రమ క్రమంగా షో, షోకి కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. ‘పోకిరి’ ముందు ఏ సినిమా నిలబడలేకపోయింది. ఫైనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఈ సినిమా. ఒకసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 11.90 cr
సీడెడ్ 5.20 cr
ఉత్తరాంధ్ర 3.00 cr
ఈస్ట్ 2.20 cr
వెస్ట్ 2.10 cr
గుంటూరు 3.13 cr
కృష్ణా 2.72 cr
నెల్లూరు 1.20 cr
ఏపీ+తెలంగాణ(టోటల్) 31.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 7.55 cr
రీ రిలీజ్(షేర్) 1.02 cr
టోటల్ వరల్డ్ వైడ్ 40.02 cr
రీ రిలీజ్ కాకుండా క్లోజింగ్ 39.00 cr

‘పోకిరి’ చిత్రానికి 16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 39 కోట్ల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బయ్యర్స్ కు 23 కోట్ల వరకు లాభాలను అందించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘పోకిరి’. రీ రిలీజ్ కూడా రికార్డులు కొట్టింది ఈ సినిమా.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus