Extra Ordinary Man: ‘ఎక్స్ట్రా’ లో నితిన్ పోలీసా.. ఆ ట్విస్ట్ హైలెట్ అట!

మహేష్ బాబు – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి’ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆ టైంలో ప్రేక్షకులకి కొత్త రకం ఫీలింగ్ ని కలిగించింది. ఒక్కసారిగా సినిమా చూస్తున్న ప్రేక్షకులు సర్ప్రైజ్ ఫీలయ్యారు. సినిమా సక్సెస్ అవ్వడానికి అది కూడా ఓ కారణమని చెప్పొచ్చు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆ ట్విస్ట్ ను వాడే ప్రయత్నం చేశారు కొంతమంది దర్శకులు. వాస్తవానికి అది కొత్త రకం ట్విస్ట్ ఏమీ కాదు.

చిరంజీవి నటించిన ‘స్టేట్ రౌడీ’ ‘రుస్తుం’ వంటి సినిమాల్లో అదే ట్విస్ట్ ఉంటుంది. గత ఏడాది వచ్చిన ‘యశోద’ లో కూడా అలాంటి ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు నితిన్ ‘ఎక్స్ట్రా’ సినిమాలో కూడా అలాంటి ట్విస్ట్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇటీవల విడుదలైన (Extra Ordinary Man) ‘ఎక్స్ట్రా’ టీజర్లో కానీ, ట్రైలర్లో కానీ.. కథ గురించి ఎక్కువ రివీల్ చేయలేదు. హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో.. అది మాత్రమే చూపించారు. ఇందులో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు.

సెకండ్ హాఫ్ లో పోలీస్ గా కనిపిస్తాడని ఇన్సైడ్ టాక్. దాని చుట్టూ అల్లిన ట్విస్ట్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది అని ఇన్సైడ్ టాక్. అందుకే ట్రైలర్లో కూడా కథ గురించి ఎక్కువగా దర్శకుడు వక్కంతం వంశీ రివీల్ చేయకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. చూడాలి మరి.. ఇందులో ఎంతవరకు నిజముందో..!

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus