పాటల చిత్రీకరణలో ” పోలీస్ వారి హెచ్చరిక “

నల్లపూసలు ఫేం ” బాబ్జీ” దర్శకత్వం లో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న “” పోలీస్ వారి హెచ్చరిక “” చిత్రం శరవేగంగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది…..! ఈ సందర్భంగా దర్శకుడు బాబ్జీ చిత్రం ప్రోగ్రెస్ ను తెలుపుతూ ” అరకులోయ , కాఫీ వనం , ఆపిల్ రిసార్ట్స్ , వైజాగ్ యారాడా బీచ్ , నకిరేకల్ లాండ్స్ , యస్ స్టూడియో మొదలైన లొకేషన్ లలో యీ చిత్రం లోని పాటలను చిత్రీకరించమని ….”
తెలిపారు….!

గత రెండు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని గాయనీ గాయకులతో ఐదు లక్షల ప్రైవేట్ సాంగ్స్ ను స్వరపరచి సంచలనం సృష్టించి , రెండు రాష్ట్రాలలోని ప్రైవేటు పాటల గాయనీ గాయకులకు , పాటల రచయితలకు అభిమాన పాత్రుడైన సంగీత దర్శకుడు ” గజ్వేల్ వేణు” ను యీ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేస్తున్నామని …” దర్శకుడు బాబ్జీ తెలిపారు…!

చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ ” రెండు రోజులలో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుందని , ఆ వెంటనే నల్గొండ లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించడం తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని ” తెలిపారు….!

అఖిల్ సన్నీ , అజయ్ ఘోష్ , రవి కాలే , షియాజీ షిండే , శుభలేఖ సుధాకర్ , కాశీ విశ్వనాథ్ , సంజయ్ నాయర్, జబర్దస్త్ వినోద్ , జబర్దస్త్ పవన్ , హిమజ , జయ వాహిని , శంకరాభరణం తులసి, మేఘనా ఖుషి , రుచిత తదితరులు ఈ చిత్ర తారాగణం…..!

కెమెరా : నళినీ కాంత్ , సంగీతం : గజ్వేల్ వేణు ,
ఎడిటర్ : శివ శర్వాణి ,
పి ఆర్ ఓ .మధు వి .ఆర్
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : హను మంతరావు ,
నిర్మాణ నిర్వహణ : ఎన్. వై. సుబ్బరాయుడు ,
నిర్మాత : బెల్లి జనార్థన్ ,
రచన , దర్శకత్వం : బాబ్జీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus