Pawan Kalyan, Balakrishna: ఎన్నికల ముందు ఇద్దరు హీరోల పొలిటికల్‌ సినిమా గేమ్‌

ఆంధ్రప్రదేశ్‌ అప్పుడే ఎన్నికల ఫీవర్‌ స్టార్ట్‌ అయిపోయింది. ఓవైపు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ‘అదిగో ఎలక్షన్లు’ అంటుంటే… మరోవైపు సీఎం జగన్‌ ‘ఎన్నికల గెలవండి మళ్లీ మంత్రులవ్వండి’ అంటున్నారు. ఇదంతా పొలిటికల్‌ యాంగిల్‌. అయితే సినిమాల యాంగిల్‌లో కూడా ఏపీ ఎన్నికల వేడి కనిపిస్తుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ముందస్తు ఎన్నికలు వస్తాయి అని అంటున్నారు. అంటే 2023లోనే వచ్చే అవకాశం ఉంది. దీంతో సినిమాల రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారట.

Click Here To Watch Now

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో పొలిటికల్‌ రిలేషన్‌ ఉన్నది ఇద్దరు అగ్రహీరోలకే. ఒకటి హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రెండోది జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. దీంతో ఎన్నికల ముందు వీరి ఆలోచన ఎలా ఉంటుంది అనే ప్రశ్న మొదలైంది. సినిమాల్లో రాజకీయం చూపించి, పొలిటికల్‌ డైలాగ్స్‌ వినిపించి… జనాలను ముఖ్యంగా అభిమానులను ఆ దిశగా నడిపించే ఉద్దేశం వెనుక ఉంటుంది. అయితే ఈ విషయంలో ఇద్దరు హీరోల పంథా వేర్వేరుగా ఉంది అనేదే ఇక్కడి విషయం.

ఆ మధ్య ఓ నిర్మాత, దర్శకుడు పవన్‌ కల్యాణ్‌ దగ్గరికెళ్లి ఓ పొలిటికల్‌ డ్రామా రీమేక్‌ గురించి మాట్లాడారట. పొలిటికల్‌ కెరీర్‌కి ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది అనే అర్థంలో వివరించే ప్రయత్నం చేశారట. అయితే ఆ సినిమా ఓకే చేయడానికి పవన్‌ కల్యాణ్ సంశయించి, ఆఖరికి నో చెప్పేశాడట. బయట రాజకీయం చేస్తూ సినిమాలో కూడా రాజకీయం చూపించాలా అని అన్నాడట పవన్‌. దీంతో ఆ ప్రాజెక్ట్‌ పక్కకు వెళ్లిపోయింది అంటున్నారు.

ఇక బాలకృష్ణ అయితే… ఎన్నికలకు దగ్గర్లో పొలిటికల్‌ డ్రామా సబ్జెక్ట్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యారని తెలుస్తోంది. తన హిట్‌ కాంబో అయిన బోయపాటి శ్రీను కాంబినేషన్‌లోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. రామ్‌ – బోయపాటి శ్రీను సినిమా తర్వాత.. ఈ సినిమా చేయాలని అనుకుంటున్నారట. వచ్చే ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలయ్యేలా చూస్తున్నారట. ఈ సినిమాలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి సన్నివేశాలు, డైలాగ్‌లు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నట్లు పవన్‌ సినిమా వద్దంటున్నా అలాంటి డైలాగ్స్‌ మాత్రం సినిమాలో ఉంటాయి. ఎందుకంటే గతంలో ఉన్నాయి కాబట్టి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus